NEWSANDHRA PRADESH

ఏపీ సీఎస్ ప‌ద‌వీ కాలం పొడిగింపు

Share it with your family & friends

కేంద్రానికి లేఖ రాసిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఆరు నెల‌ల కాలం పాటు పొడిగించాల‌ని కోరారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ మేర‌కు ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ‌పై స్పందించారు. ఈమేర‌కు నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ప‌ద‌వీ కాలాన్ని పొడిగించేందుకు అంగీకారం తెలిపింది.

ఇదిలా ఉండ‌గా సీఎస్ ప‌ద‌వీ కాలం పొడిగించ‌డంతో నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ 2024 ఏడాది డిసెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు సీఎస్ గా కొన‌సాగ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ స‌ర్కార్ ఓట‌మి పాలైంది.

చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని కూట‌మి స‌ర్కార్ ఏర్పాటైంది. గ‌తంలో సీఎస్ గా ప‌ని చేసిన జ‌వ‌హ‌ర్ రెడ్డిని వ‌ద్ద‌నుకున్నారు సీఎం. ఈ మేర‌కు ఏపీలో ప‌ని చేస్తున్న సీనియ‌ర్ ఐఏఎస్ ల‌లో నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ వైపు మొగ్గు చూపారు. ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపించాలంటే నీర‌బ్ లాంటి త‌న‌కు అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు సీఎం. ఈ మేర‌కు లేఖ రాయ‌డం, కేంద్రం ఒప్పుకోవ‌డంతో లైన్ క్లియ‌ర్ అయ్యింది.