రాష్ట్రపతి ప్రసంగం అద్భుతం
ప్రశంసించిన ప్రధానమంత్రి మోడీ
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి గురువారం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆమెను సభకు సాదర స్వగతం పలికారు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖార్, పీఎం.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వాన్ని అభినందించారు రాష్ట్రపతి ముర్ము. ప్రగతి, సుపరిపాలన అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాలలో ముందుకు వెళుతోందని పేర్కొన్నారు.
రోడ్ మ్యాప్ స్పష్టంగా ఉందని ప్రశంసించారు రాష్ట్రపతి. ఇది దేశం చేస్తున్న పురోగతిని , ముందుకు సాగే సామర్థ్యాన్ని కూడా కవర్ చేసిందని చెప్పారు. దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు రావడానికి మరింత కష్ట పడాల్సిన అవసరం ఉందన్నారు ద్రౌపది ముర్ము.
ఇదిలా ఉండగా ఉభయ సభలను ఉద్దేశించి దేశ రాష్ట్రపతి చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందని ప్రశంసించారు ప్రధానమంత్రి మోడీ.