అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
మంగళగిరి – ఏపీ హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరి లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ, ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పలు అంశాలను ప్రస్తావించారు. వాటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.
ప్రధానంగా రాష్ట్రంలో మహిళలు, యువత, బాలికలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న వైసీపీ సర్కార్ వీటి గురించి పట్టించు కోలేదని వాపోయారు. ప్రధానంగా మహిళా భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు వంగలపూడి అనిత.
రాష్ట్ర వ్యాప్తంగా పేరుకు పోయిన గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, ఇతర అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పోలీసులు ప్రజల మన్ననలు పొందాలని కోరారు. ఈ సందర్బంగా అనిత ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, వాటిని పునరుద్దరించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ రిక్రూట్ మెంట్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .