ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గు చేటు
మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి
అమరావతి – ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. ఏ మాత్రం సిగ్గుంటే తను లేఖ రాసి ఉండేవాడు కాదన్నారు.
ఆనాడు నిండు సభలో గెలిచిన ఎమ్మెల్యేలలో 10 శాతానికి మించి ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించిన జగన్ రెడ్డి అప్పుడే మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు ఆనం రామ నారాయణ రెడ్డి.
ఏం ముఖం పెట్టుకుని స్పీకర్ కు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలంటూ లేఖ రాశారో చెప్పాలన్నారు. అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా నటిస్తున్న జగన్ రెడ్డికి అంత సీన్ లేదన్నారు ఆనం రామ నారాయణ రెడ్డి.
గ్రామాల్లో కూడా జగన్ పరదాలు కట్టుకుని తిరిగారని ఎద్దేవా చేశారు. – జగన్ ఏనాడూ అసెంబ్లీ నియమాలు పాటించలేదన్నారు.