NEWSANDHRA PRADESH

అట‌వీ భూముల ఆక్ర‌మ‌ణపై ఆరా

Share it with your family & friends

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫైర్

అమ‌రావ‌తి – డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు పెంచారు. ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే త‌న‌కు కేటాయించిన శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు స్టార్ట్ చేశారు. ఉన్న‌తాధికారుల‌తో భేటీ అవుతూ కీల‌క‌మైన స‌మాచారం త‌న‌కు కావాల్సిందిగా ఆదేశించారు. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసినా ఊరుకునే ప్ర‌స‌క్తి లేదంటూ హెచ్చ‌రించారు.

త‌మది ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో కొలువు తీరిన వైసీపీ స‌ర్కార్ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిందంటూ ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో కీల‌క‌మైన కాలుష్య నియంత్ర‌ణ మండ‌లిపై స‌మీక్ష చేప‌ట్టారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌.

ఇదే స‌మ‌యంలో క‌ర్నూలు జిల్లాలోని గ‌ని రిజ‌ర్వ్ ఫారెస్ట్ ప‌రిధిలో గ్రీన్ కో ఎన‌ర్జీస్ సంస్థ అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించు కోవ‌డంపై ఆరా తీశారు. ప‌ర్య‌వ‌ర‌ణ రూల్స్ ను అతిక్ర‌మించ‌డంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. డీఎఫ్ ఓలు శ్యామ‌ల‌, శివ శంక‌ర్ రెడ్డి, సుబ్బా రాయుడులు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.