ఎవరు పార్టీని వీడినా నష్టం లేదు
ప్రకటించిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు వెళ్లినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఫామ్ హౌస్ లో ప్రసంగించారు.
తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన. అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనదన్నారు. తెలంగాణ సాధించిన ఘనత కన్నా తనకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదని పునరుద్ఘటించారు.
కీలక సమయం లో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారని అన్నారు. కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతుంటాయని చరిత్ర లోకి వెళితే అర్థమవుతుందన్నారు కేసీఆర్.. కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోస పోయారని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్, రైతు బంధు రాక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పార్టీని ఎవరు విడిచి పెట్టి వెళ్లి పోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ ఫీనిక్స్ పక్షి లాంటిదన్నారు కేసీఆర్.