ఏపీడీసీకి చిన్న వాసుదేవ రెడ్డి గుడ్ బై
రాజీనామా ఆమోదించిన ఏపీ సర్కార్
అమరావతి – రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వైసీపీ హయాంలో నియమితులైన వారంతా ఒక్కరొక్కరుగా తమ పదవులను వీడుతున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ (APDC) కు వైస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న చిన్న వాసుదేవ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపింది.
ఈ సందర్బంగా చిన్న వాసుదేవ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి సూచనలుతో ఏప్రిల్ 2020లో ఏపీడీసీని ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వానికి , ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే అత్యాధునిక డిజిటల్ మీడియా మౌలిక సదుపాయాలను అందించడమే కార్పొరేషన్ యొక్క ఉద్దేశమని తెలిపారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన ఫ్రేమ్‌వర్క్‌లో పని చేస్తుందన్నారు. కార్పొరేషన్ వివిధ సామాజిక, డిజిటల్ మీడియా నెట్‌వర్క్‌ల ద్వారా రాష్ట్ర పౌరులకు ప్రభుత్వ కంటెంట్ చేరుకునేలా డిజిటల్ మీడియా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని చెప్పారు.