మోదీ సర్కార్ పై కూటమి యుద్దం
లోక్ సభలో సమస్యలపై పోరాటం
న్యూఢిల్లీ – ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి ఇక నుంచి భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యూఢిల్లీ లోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి కీలక సమావేశం జరిగింది. ప్రతిపక్షాలకు చెందిన పార్టీల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పార్లమెంట్ లో భారత కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తాజాగా జరిగిన స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధానంగా చర్చకు వచ్చింది. అంతే కాకుండా 25 లక్షల మంది విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిన నీట్ ఎగ్జామ్ లీకేజీ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన వైఫల్యం బీజేపీ సర్కార్ దేనంటూ దీనిపై ప్రత్యేకంగా ప్రస్తావించాలని, నిలదీయాలని నిర్ణయించారు.
అంతే కాకుండా అగ్ని వీర్ , నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంశాలు ప్రజలపై ప్రభావితం చూపిస్తున్నాయని వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలని, నిలదీయాలని పిలుపునిచ్చారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే.