మంత్రివర్గ విస్తరణపై మంతనాలు
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ
న్యూఢిల్లీ – టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు ఢిల్లీలో. త్వరలోనే కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ పదవీకాలం ముగిసింది. దీంతో ఎవరిని నియమిస్తారనే దానిపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది.
టీపీసీసీ చీఫ్ పదవితో పాటు మంత్రివర్గం విస్తరణపై కూడా చర్చలు జరిగినట్లు టాక్. ఈ కీలక సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు.
వీరితో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు టాక్. ఇదిలా ఉండగా ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరిపారు కేసీ వేణుగోపాల్ తో.