అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాషకు గుర్తింపు
విశ్వ హిందీ పరిషత్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
అమరావతి – అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాషకు గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామని విశ్వ హిందీ పరిషత్ చైర్మన్ పద్మ విభూషణ్ ఆచార్య యార్లగ డ్డ లక్ష్మిప్రసాద్ పేర్కొన్నారు . ఆయన శుక్రవారం ఏయు హిందీ విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రధాని మోడీ హిందీ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా కృషి చేస్తున్నా రని కొనియాడారు . దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు హిందీ నేర్చు కోవాలని సూచించారు. చట్టాలన్నింటిని భవిషత్ లో హిందీలో వస్తాయని వెల్లడించారు . కాబట్టి విద్యార్థులంతా ఇప్పటి నుంచే హిందీ నేర్చుకోవాలని కోరారు.
వైఎస్ఆర్ వైద్య విశ్వ విద్యా లయానికి ఎన్ టీ ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా పునరుద్ధ రించినందుకు సీఎం చంద్రబాబు కు , వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్ టీ ఆర్ కు భారతరత్న సాధిస్తామని సీబీఎన్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు.
హిందీ భాషను ఐక్యరాజ్య సమితి కూడా అధికార భాషగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలేనని అన్నారు. వైఎస్ఆర్సీపీ కి జరిగింది కూడా ఇదేనని చెప్పారు. యార్లగడ్డ గతంలో ఎన్ టీ ఆర్ వైద్య విశ్వ విద్యాలయ పేరు మార్చిన సంద ర్భంలో హిందీ భాషా చైర్మన్ పదవి తో పాటు పలు నామినేటెడ్ పదవు లకు రాజీనామా చేశారు.