NEWSANDHRA PRADESH

బాబు పాల‌న విధ్వంసానికి చిరునామా

Share it with your family & friends

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి

నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అధికారంలో ఉన్న కూట‌మికి చెందిన వారు ఎవ‌రైనా దాడుల‌కు పాల్ప‌డినా ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌న్నారు .

నేను 24 గంట‌ల పాటు అంద‌రికీ అందుబాటులో ఉంటాన‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. పొద‌ల‌కూరు ప‌ర్య‌ట‌న‌లో పార్టీ శ్రేణుల‌కు న‌మ్మ‌కం క‌లిగించేలా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొలువు తీరిన టీడీపీ కూట‌మి ప‌వ‌ర్ ను అడ్డం పెట్టుకుని దాడుల‌కు దిగుతోంద‌ని ఆరోపించారు కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమంతో కాకుండా దానికి భిన్నంగా విధ్వంస కాండ‌తో ప్రారంభించార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఆధిపత్యం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ఆస్తులపై తెలుగుదేశం నాయకులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి రాష్ట్రంలో 40 శాతం ఓట్లు వ‌చ్చాయ‌ని మ‌రిచి పోకూడ‌ద‌న్నారు కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి.