పని చేసిన వారికి పదవులు
టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు
అమరావతి – తెలుగుదేశం పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. శుక్రవారం ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , తదితరుల సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు.
కార్యకర్తలు ఏ సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి వచ్చి విన్నవించు కోవచ్చని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని చెప్పారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు.
పార్టీకి చెందిన వారిపై నమోదు చేసిన అక్రమ కేసులను తొలగించేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు పల్లా శ్రీనివాస రావు.
టీడీపీ అంటే బీసీలు… బీసీలు అంటే టీడీపీ అని మరోసారి సీఎం చంద్రబాబు రుజువు చేశారని చెప్పారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు. బాబు నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ప్రస్తుతం అధినేత తనకు దిశానిర్ధేం చేసిన విషయాలను తూచ తప్పకుండా.. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేలా.. నామినేటెడ్ పదవులతో ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ముందు తీసుకెళ్లడమే తన ప్రధానమైన బాధ్యతగా తెలిపారు.