బాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ
మర్యాద పూర్వకమేనన్న రాధాకృష్ణన్
అమరావతి – తెలంగాణ రాష్ట్ర కె. రాధాకృష్ణన్ శుక్రవారం అందరినీ విస్తు పోయేలా చేశారు. ఆంధ్రప్రేదశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరిన సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఆయన నివాసానికి గవర్నర్ వెళ్లారు. బాబును సన్మానించారు. ఇద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని బాబు చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
గతంలో తెలంగాణ ప్రాంతాన్ని సర్వ నాశనం చేసిన ఘనత బాబుదేనని, ఇప్పుడు కీలకమైన సచివాలయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉన్నతాధికారులే తిష్ట వేశారని, ఇక్కడి నేతలు చెప్పిన పనులేవీ కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో గవర్నర్ తనంతకు తానుగా ఏపీ సీఎం ఇంటికి వెళ్లి కలవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి టీడీపీకి చెందిన నాయకులకు ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలు లేక పోలేదు. మొత్తంగా గవర్నర్ బాబుతో భేటీ వెనుక రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయని టాక్.