కేసీఆర్ కు షాక్ ఎమ్మెల్యే జంప్
చేవెళ్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిక
న్యూఢిల్లీ – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. చేవెళ్ల శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కేసీఆర్ ఎంతగా నచ్చ చెప్పినా, బుజ్జ గించినా ఆయన వినిపించు కోలేదు. ఇక కారు పనికి రాదని, అది షెడ్డుకే పరిమితం కాక తప్పదంటూ పేర్కొన్నారు.
శుక్రవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపా దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తను వెళ్లకుండా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
కేసీఆర్ ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ కు ఎమ్మెల్యే కాలె యాదయ్యను పిలిపించుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో మంచి పదవులు వస్తాయని చెప్పినా యాదయ్య వినిపించు కోలేదు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు సాధించింది. చేవెళ్ల ఎమ్మెల్యే జంప్ కావడంతో ఆ సంఖ్య ఇప్పుడు 31కి పడి పోయింది. ఇప్పటి దాకా 8 మంది బీఆర్ఎస్ లో చేరారు.