నేడే కొండగట్టుకు పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలో పేరు పొందిన పవిత్ర స్థలం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్బంగా భారీ ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కు ముందు నుంచీ అంజన్న అంటే చచ్చేంత ఇష్టం.
జనసేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రచారానికి కొండగట్టు అంజన్న ఆలయం నుంచే శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారానికి ఆయన వారాహి ప్రజా యాత్ర అని పేరు పెట్టారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనా, కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితం అయినా తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం దుమ్ము రేపారు పవన్ కళ్యాణ్.
21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం 7 గంటలకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరి వెళతారు. రోడ్డు మార్గాన 11 గంటలకు చేరుకుంటారు. స్వామికి మొక్కులు తీర్చుకుంటారు పవన్ కళ్యాణ్.