NEWSANDHRA PRADESH

విద్య‌తోనే వికాసం క‌లుగుతుంది

Share it with your family & friends

నారా భువనేశ్వ‌రి హిత‌బోధ

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. పిల్ల‌లు చ‌దువుతో పాటు ఆట‌ల‌పై కూడా దృష్టి సారించాల‌ని సూచించారు.

త‌న తండ్రి దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు పేరుతో చ‌ల్లప‌ల్లిలో ఏర్పాటు చేశారు స్కూల్ ను. ఇక్క‌డ వంద‌లాది మంది పిల్ల‌లు చ‌దువుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా నారా భువ‌నేశ్‌వ‌రి బ‌డిని సంద‌ర్శించారు. అక్క‌డ ఎలా చెబుతున్నారో ప‌రిశీలించారు. మౌలిక స‌దుపాయాలు ఉన్నాయో లేవో చూశారు.

అనంత‌రం పాఠ‌శాల‌ను నిర్వ‌హిస్తున్న టీచ‌ర్ల‌తో ముచ్చ‌టించారు. అక్క‌డి నుంచి నేరుగా పిల్ల‌ల‌తో చాలా సేపు గ‌డిపారు. బాల బాలిక‌ల‌ను చూస్తుంటే త‌ను చ‌దువుకుంటున్న రోజులు గుర్తుకు వ‌చ్చాయ‌ని అన్నారు నారా భువ‌నేశ్వ‌రి. ఏది ఏమైనా జీవితంలో రాణించాలంటే క‌ష్ట ప‌డాల‌ని, ప్ర‌ధానంగా చ‌దువుపై ఫోక‌స్ పెట్టాల‌ని అన్నారు.