NEWSTELANGANA

సుస్థిర అభివృద్దిపై స్మితా ఫోక‌స్

Share it with your family & friends

ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి స‌మీక్ష

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి , సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ స్మితా స‌బ‌ర్వాల్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఆమె గ‌తంలో కీల‌క‌మైన ఉన్న‌తాధికారిగా వ్య‌వ‌హ‌రించారు. కానీ ఉన్న‌ట్టుండి ప్ర‌భుత్వం మార‌డంతో అప్ర‌ధాన్య పోస్టుకు బ‌దిలీ చేశారు. అయినా ఎక్క‌డా నిరాశ‌కు గురి కాలేదు.

పూర్తిగా ప‌నిపై ఫోక‌స్ పెట్టారు. గ‌తంలో ప‌ని చేసిన స‌మ‌యంలో ప్ర‌జలు మెచ్చిన అధికారిగా పేరు పొందారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ఉద్య‌మ కాలంలో అమ‌రుల త‌ల్లుల‌ను గౌర‌వించిన తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందారు.

ప్ర‌స్తుతం ఆర్థిక శాఖ‌లో కీల‌క‌మైన మార్పులు తీసుకు వ‌చ్చేందుకు తంటాలు ప‌డుతున్నారు. తెలంగాణ ఫైనాన్స్ క‌మిష‌న్ లో తొలి నివేదిక‌ను త‌యారు చేశారు. ఇందులో సుస్థిర అభివృద్ది ల‌క్ష్యాల‌కు ప్ర‌యారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇందులో భాగంగా శిక్ష‌ణ ఇచ్చారు.