అమరావతి ఎయిమ్స్ పై సీఎం ఫోకస్
సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అమరావతిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ లో చోటు చేసుకున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఎయిమ్స్ కు చెందిన ప్రతినిధులు తనతో సమావేశం అయ్యారని చెప్పారు. ఈ ప్రాంతంలోని లక్షలాది మంది పేదలకు నాణ్యమైన వైద్యం అందించడానికి తాము అమరావతికి ఎయిమ్స్‌ను తీసుకు వచ్చామని స్పష్టం చేశారు ఏపీ సీఎం.
కేంద్ర సహకారంతో రాష్ట్ర తోడ్పాటుతో ఎయిమ్స్ ను నిర్మించడం జరిగిందన్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసిందని తెలుసుకుని తాను షాక్ అయ్యానని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.
రక్షిత మంచి నీరు వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించక పోవడంతో రోగులు, సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలుసుకుని బాధ కలిగించిందన్నారు.
. ఆసుపత్రి పూర్తి సామర్థ్యంతో పనిచేయలేక పోవడంతో నీటి కొరత కూడా ఆరోగ్య సంరక్షణకు ఆటంకంగా మారిందని, ఇవన్నీ ఇప్పుడు మారుతాయని ప్రకటించారు.