నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే
డిమాండ్ చేసిన సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ పరీక్ష 2024కు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఒక్కో పేపర్ ను రూ. 30 వేలకు అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు రాజస్తాన్, హర్యానా, బీహార్ , మధ్య ప్రదేశ్ లలో ఈ పరీక్ష స్కామ్ కు సంబంధించి మూలాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సీబీఐని విచారణకు ఆదేశించింది కేంద్రం. మరో వైపు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్కామ్ లకు మోదీ ప్రభుత్వం కేరాఫ్ గా నిలిచిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నీట్ పరీక్ష ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేశారు.
దేశంలోని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్ లేఖలు రాశారు. నీట్ ను రద్దు చేయాలని తీర్మానం చేయాలని, రద్దు చేసేంత దాకా పోరాడాలని పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.