NEWSTELANGANA

ఈడీ రైడ్ ర‌వి ప్ర‌కాష్ ప‌రార్

Share it with your family & friends

ఆఫీసులో ఏడున్న‌ర కోట్ల న‌గ‌దు

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ ర‌వి ప్ర‌కాష్ సార‌థ్యంలో నిర్వ‌హిస్తున్న ఆర్టీవీ ఆఫీసుపై ఊహించ‌ని రీతిలో \కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) సోదాలు చేప‌ట్టింది.

ఆర్టీవీ ఓనర్ రవిప్రకాష్ పై ఇప్పటికే పెద్ద ఎత్తున ఈడీ కేసులు ఉన్నాయ‌నే విష‌యం అందరికీ తెలిసిందే. ఆఫ్రికాలో వ్యాపారాల కోసం పెద్ద ఎత్తున డబ్బులు హవాలలో తరలించి అడ్డంగా బుక్ అయ్యాడు ర‌వి ప్ర‌కాష్. ఇప్పుడు ఆర్టీవీ ఛాన‌ల్ కోసం మొత్తం క్యాష్ రూపంలో ఖర్చు పెడుతున్నారు.

ఈ విషయం బయటకు పొక్కటంతో ఆర్టీవీపై ఈడీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. రవి ప్రకాష్ గత సంవత్సర కాలంగా ఆర్టీవీని ఎలా నడుపుతున్నారు. క్యాష్ లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారనే లెక్కలు బయటకు తీస్తే విస్తుబోయే నిజాలు బయటకు వచ్చాయ్.

ఆర్టీవీ కొనుగోలు చేసిన ఎక్విప్మెంట్ కు సైతం బిల్లులు లేవు.. అన్ని కాష్ లోనే చెల్లింపులు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఎంప్లాయిస్ జీతాలు సైతం క్యాష్ లోనే ఇస్తున్న విషయాలు అన్నిటినీ లెక్కలు బయటకు తీశారు. రెండు రోజులుగా గోప్యంగా విచారణ చేస్తు లెక్కలపై ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

అసలు విషయం అంత బట్ట బయలు కావటంతో రవిప్రకాష్ పరారిలో ఉన్నాడు. ఆఫీస్ ఒక ఫ్లోర్ అంతా జ‌ల్లెడ ప‌ట్టారు. అంతే కాకుండా ఆఫీసులో ఏడున్న‌ర కోట్ల న‌గ‌దు దొరికిన‌ట్లు స‌మాచారం. ర‌వి ప్ర‌కాష్ త‌ర్వాత కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌మౌళిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు.