SPORTS

టీమిండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత

Share it with your family & friends

ద‌క్షిణాఫ్రికాపై చిర‌స్మ‌ర‌ణీయ గెలుపు

బ్రిడ్జిటౌన్ – వెస్టిండీస్ లోని బ్రిడ్జ్ టౌన్ లో జ‌రిగిన ఉత్కంఠ భ‌రిత పోరులో ఎట్ట‌కేల‌కు రోహిత్ సార‌థ్యంలోని భార‌త క్రికెట్ జ‌ట్టు విశ్వ విజేత‌గా నిలిచింది. టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. ప్ర‌త్య‌ర్థి ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును మ‌ట్టి క‌రిపించింది. రెండోసారి క‌ప్ ను ముద్దాడింది. ఈ సంద‌ర్బంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

17 ఏళ్ల త‌ర్వాత టీమిండియా క‌ప్ ను కైవ‌సం చేసుకోవ‌డం విశేషం. విరాట్ కోహ్లీ, పాండ్యా అద్బుతంగా ఆడారు. విచిత్రం ఏమిటంటే ర‌న్ మెషీన్ టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. 2011లో ధోనీ నేతృత్వంలో భార‌త్ ఇప్పుడు క‌ప్ ను చేజిక్కించుకుంది. స‌మిష్టి ఆట తీరుతో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే భార‌త్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 176 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ్యాటింగ్ కు దిగిన ద‌క్షిణాఫ్రికా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 169 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. క్లాసెన్ ఒంట‌రిగా పోరాడినా చివ‌ర‌కు భార‌త్ జ‌య‌కేత‌నం ఎగుర వేసింది.

ఈ టోర్నీలో టీమిండియా ఓట‌మి అన్న‌ది లేకుండా ఫైన‌ల్ కు చేర‌డం విశేషం.