సూర్య కుమార్ స్టన్నింగ్ క్యాచ్
టి20 ఫైనల్ మ్యాచ్ లో కీలకం
బ్రిడ్జిటౌన్ – వెస్టిండీస్ లో జరిగిన టి20 వరల్డ్ కప్ ను టీమిండియా సమిష్టి కృషితో కైవసం చేసుకుంది. భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 రన్స్ మాత్రమే చేసింది. క్లాసెన్ ఒంటరిగా పోరాడినా చివరకు భారత్ జయకేతనం ఎగుర వేసింది.
క్లాసెన్ , డికాక్ ఇద్దరూ మ్యాచ్ ను చివరి బంతి వరకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అనుకోకుండా వారిని నిరాశ వరించింది. పాండ్యా వేసిన బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద ఉన్న స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ మ్యాచ్ ను మలుపు తిప్పేలా చేసింది.
ఇదిలా ఉండగా కప్ ను స్వంతం చేసుకునేందుకు భారత జట్టు 17 ఏళ్లు ఆగాల్సి వచ్చింది. 2011లో జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఆ తర్వాత భారత జట్టును ఊరిస్తూ వచ్చింది. చివరకు 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు.