టి20 ఫార్మాట్ కు కోహ్లీ గుడ్ బై
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
బ్రిడ్జ్ టౌన్ – రన్ మెషీన్ అనే పేరు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమై ఉంటుంది విరాట్ కోహ్లీని చూస్తే. తను ఎంత కీలకమైన ఇన్నింగ్స్ లు ఇప్పటి వరకు ఆడాడో చెప్పాలంటే ఓ చరిత్ర అవుతుంది. తాజాగా వెస్టిండీస్ లోని బ్రిడ్జ్ టౌన్ లో జరిగిన కీలకమైన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. 7 పరుగుల తేడాతో ఓడించి దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చింది.
విరాట్ కోహ్లీ సూపర్ షోతో ఆకట్టుకున్నాడు. తను కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో అదుర్స్ అనిపించాడు. 76 పరుగులు చేశాడు. 2 కళ్లు చెదిరే సిక్స్ లు ఉన్నాయి. మ్యాచ్ ఆద్యంతమూ అద్భుతమైన పర్ ఫార్మెన్స్ తో దుమ్ము రేపిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక 15 వికెట్లతో అదుర్స్ అనిపించిన జస్ ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ లభించింది.
ఇదిలా ఉండగా కోట్లాది క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు.