SPORTS

హ్యాట్సాఫ్ రాహుల్ ద్ర‌విడ్

Share it with your family & friends

భార‌త జ‌ట్టుకు ఇక గుడ్ బై

బ్రిడ్జి టౌన్ – వెస్టిండీస్ వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను భార‌త్ కైవ‌సం చేసుకుంది. 7 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 176 ర‌న్స్ చేసింది. కోహ్లీ 76 ర‌న్స్ చేస్తే , అక్స‌ర్ ప‌టేల్ 36 ర‌న్స్ చేశారు. అనంత‌రం ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పొయి 169 ప‌రుగులు చేసింది.

భార‌త జ‌ట్టుకు సుదీర్ఘ కాలం పాటు హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీ కాలం నేటితో పూర్త‌యింది. దీంతో త‌న క్రికెట్ చ‌రిత్ర‌లో జ‌ట్టుకు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు రావ‌డంతో సంతృప్తిని వ్య‌క్తం చేశాడు. భార‌త దేశ జాతీయ ప‌తాకాన్ని ధ‌రించి స్టేడియం న‌లుమూలలా క‌లియ తిరిగాడు.

ఈ సంద‌ర్బంగా టీమిండియా ఆట‌గాళ్లు త‌మకు మార్గ‌ద‌ర్శ‌కుడిగా ఉంటూ వ‌చ్చిన ది వాల్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇదిలా ఉండ‌గా దేశానికి చెందిన వివిధ రంగాల ప్ర‌ముఖులు భార‌త జ‌ట్టును, ప్ర‌త్యేకించి రాహుల్ ద్ర‌విడ్ ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.