దేశం గర్వ పడేలా చేశారు
వెల్ డన్ మై క్రికెటర్స్
న్యూఢిల్లీ – ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా క్రీడా, రాజకీయ, వ్యాపార, సినీ, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్బంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ విజయం దేశానికి స్పూర్తి దాయకంగా నిలిచి పోతుందని తెలిపారు. ప్రతి ఒక్క క్రికెటర్ కు పేరు పేరునా కంగ్రాట్స్ తెలిపారు.
అంతే కాకుండా రాహుల్ ద్రవిడ్ , కోహ్లీ, పాండ్యాను, బీసీసీఐని అభినందించారు. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఎక్కడా పొరపాటు పడకుండా సమిష్టి కృషితో రాణించారని, ప్రపంచ విజేతలుగా నిలిచారంటూ కొనియాడారు. ఇదిలా ఉండగా భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.
టీమిండియా ప్రపంచ కప్ ను గెలిచిన వెంటనే రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్నందుకు పేరు పేరునా ప్రతి ఒక్క క్రికెటర్ ను, టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను, కెప్టెన్ రోహిత్ శర్మను అభినందనలతో ముంచెత్తారు.
క్లిష్ట పరిస్థితులలో టోర్నీ ఆసాంతం జట్టు అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడారు. వెల్ డన్, టీమ్ఇండియా అంటూ ప్రశంసించారు.