ద్రవిడ్ కు మోడీ అభినందన
కోచ్ అంకిత భావం స్పూర్తి దాయకం
న్యూఢిల్లీ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. విండీస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వ విజేతగా నిలవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రధాన మంత్రి ప్రత్యేకంగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన కోచింగ్ ప్రయాణం భారత క్రికెట్ విజయాన్ని దక్కించుకునేలా చేసిందని తెలిపారు నరేంద్ర మోడీ.
అచంచలమైన అంకితభావం, వ్యూహాత్మక అంతర్దృష్టి, సరైన ప్రతిభను పెంపొందించడం జట్టును మార్చేలా చేశాయని కొనియాడారు.రాహుల్ ద్రవిడ్ అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు పీఎం. ఇదే సమయంలో తరాలకు స్ఫూర్తినిచ్చినందుకు భారతదేశం అతనికి కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు.
వెల్ డన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటూ ప్రశంసల జల్లులు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.