NEWSTELANGANA

ఎస్బీఐ చైర్మ‌న్ శెట్టికి సీఎం కంగ్రాట్స్

Share it with your family & friends

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా స్వ‌స్థ‌లం

హైద‌రాబాద్ – ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన చ‌ల్లా శ్రీ‌నివాసులు శెట్టికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆయ‌న గ‌త కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగంలో విశిష్ట సేవ‌లు అందిస్తూ వ‌చ్చారు. దేశంలోనే అత్యున్న‌త‌మైన బ్యాంకింగ్ సేవ‌లు అందించ‌డంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విశిష్ట పాత్ర నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా చ‌ల్లా శ్రీ‌నివాసులు శెట్టిని తెలంగాణ‌, ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రాల‌కు చెందిన సినీ, క్రీడా, రాజ‌కీయ‌, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఏపీ ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ మంత్రి నారా లోకేష్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి చ‌ల్లా శ్రీ‌నివాసులు శెట్టికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎం స్పందించారు. ఇదిలా ఉండ‌గా చ‌ల్లా శ్రీ‌నివాసులు శెట్టి స్వ‌స్థ‌లం జోగుళాంబ గ‌ద్వాల జిల్లా. దేశంలోనే అత్యున్న‌త‌మైన‌, ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఎస్‌బీఐ చైర్మన్‌ పదవిని అధిరోహించడం ఒక మహత్తర సందర్భమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

శ్రీనివాసులు శెట్టి తన కొత్త పాత్రలో అనేక విజయాలు , ప్రశంసలతో పాటు పదవీ కాలం కొనసాగాలని ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు.