సామాజిక సంక్షేమానికి టీడీపీ కేరాఫ్
టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక సంక్షేమానికి టీడీపీ కేరాఫ్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో జూలై 2న పెనుమాకలో స్వయంగా సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో చల్లా శ్రీనివాస రావు మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే 5 హామీలపై చంద్రబాబు సంతకం చేశారని చెప్పారు. గత ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడితే… చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు.
తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా తనను నియమించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియ చేసినట్లు పేర్కొన్నారు.
శాసన సభ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లతో తనను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టిన గాజువాక ఓటరు దేవుళ్లకు రుణపడి ఉంటానని చెప్పారు. టీడీపీ పార్టీ అంటే ఒక పవత్రిమైన ఆలోచనతో పెట్టిన పార్టి అన్నారు. ఈ పార్టీలో ఉండటం అంటే గొప్పగా భావిస్తున్నానని చెప్పారు పల్లా శ్రీనివాస రావు.
గొప్ప సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉండటంతో జన్మ ధన్యమైందని అన్నారు.