సర్కార్ కు నిరుద్యోగులు భయపడరు
బల్మూరి..రియాజ్ లపై ఆర్ఎస్పీ ఫైర్
హైదరాబాద్ – తమ న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి నాయకుడు మోతీ లాల్ నాయక్ గాంధీ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయనను కలిసి నచ్చ చెప్పేందుకు వచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్. వారు వస్తున్న విషయం తెలుసుకున్న వెంటనే వందలాది మంది నిరుద్యోగులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
భారీ ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బల్మూరి వెంకట్ , రియాజ్ లను ఆస్పత్రి లోపలికి వెళ్లే ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు నిరుద్యోగుల పట్ల.
దీనిపై తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బల్మూరి, రియాజ్ లను పిరికి పందలంటూ నిప్పులు చెరిగారు. నిరుద్యోగులు మీలాంటి వారికి భయపడరని , దమ్ముంటే మీ సీఎం రేవంత్ రెడ్డితో ఒప్పించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.