SPORTS

ది వాల్ ద్రవిడ్ కు కేటీఆర్ కంగ్రాట్స్

Share it with your family & friends

టీమిండియా హెడ్ కోచ్ భావోద్వేగం

హైద‌రాబాద్ – రోహిత్ శ‌ర్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్భుతం చేసింది. 17 ఏళ్ల త‌ర్వాత ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. 143 కోట్ల మంది భార‌తీయులు గ‌ర్వ ప‌డేలా , స‌మున్న‌త జాతీయ ప‌తాకం స‌గ‌ర్వంగా ఎగిరేలా చేసింది. ఈ సంద‌ర్బంగా టీమిండియాను విజ‌య తీరాల‌కు చేర్చ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించారు హెడ్ కోచ్ , మెంటార్ , భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్ర‌విడ్.

యావ‌త్ భార‌తీయులంతా ఆయ‌న‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఎక్క‌డా భేష‌జాల‌కు వెళ్ల‌కుండా త‌న ప‌నేదో తాను చేసుకుంటూ వెళ్లి పోయే మ‌న‌స్త‌త్వం రాహుల్ ది. అందుకే ఆయ‌న‌ను ది వాల్ అని కూడా అంటారు..ఫ్యాన్స్ పిలుచుకుంటారు.

ఈ సంద‌ర్బంగా రాహుల్ ద్ర‌విడ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆనందాన్ని పంచుకున్నారు. త‌న అభిమాన క్రికెట‌ర్ ఆ రోజుల్లో ద్ర‌విడ్ అంటూ కితాబు ఇచ్చారు. తాను చ‌దువుకునే రోజుల్లో ది వాల్ ఫోటో పెట్టుకున్నాన‌ని తెలిపారు.