వెంకయ్యకు మోడీ అభినందన
రాజకీయాలలో అరుదైన నాయకుడు
న్యూఢిల్లీ – ఏపీకి చెందిన మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పుట్టిన రోజు ఇవాళ? ఈ సందర్బంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియ చేశారు. విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ఆయన జీవితం దేశంలోనే అత్యున్నతమైన పదవిని అలంకరించేలా చేసింది. అద్భుతమైన ప్రతిభా పాటవాలను కలిగి ఉన్నారు. ఛలోక్తులు విసరడంలో, సమయ స్పూర్తిని ప్రదర్శించడంలో తనకు తానే సాటి.
రాజ్య సభ స్పీకర్ గా ఆయన సభను నడిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా, ఆలోచింప చేసేలా చేసింది. దేశానికి అమూల్యమైన సేవలను అందించారు. వినయపూర్వకమైన ప్రారంభం నుండి దూరదృష్టి గల నాయకుడు , రాజనీతిజ్ఞుడిగా మారడానికి అతని ప్రయాణం మిలియన్ల మందికి ప్రేరణగా ఉపయోగపడుతుందని కొనియాడారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ.
వెంకయ్య నాయుడుకు ప్రజల సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధత, దార్శనిక నాయకత్వం , జాతి పురోగతి పట్ల ఆయనకున్న అంకితభావం నిజమైన జాతీయ సంపదగా మార్చాయని కొనియాడారు.