బ్రిటీష్ చట్టాలు రద్దు చేస్తాం
త్వరలోనే భారత చట్టాలు అమలు
న్యూఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిమినల్ వ్యవస్థ పూర్తిగా దేశీయమైనదని అన్నారు. నేటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్‌లో దేశీయ చట్టాలను అమలు చేస్తామని ప్రకటించారు.
త్వరలో బ్రిటీష్ చట్టాలను రద్దు చేసి భారత చట్టాలను అమలు చేస్తమని స్పష్టం చేశారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. కొత్త చట్టం విధానంతో ఇవాల్టి నుండి ప్రభుత్వం పని చేయడం ప్రారంభించిందని చెప్పారు.
ఈ చట్టాలలో పూర్తిగా భారతీయ ఆత్మ ఉందన్నారు. అయితే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ స్పూర్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు అమిత్ షా. మొదటిది మహిళలపైనే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన చెందారు.
మాబ్ లించింగ్ మొదటిసారిగా తీసుకు రావడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా రాజ ద్రోహానికి కొత్త అర్థం చెప్పారు కేంద్ర మంత్రి. ఇది దేశ సమగ్రత కోసం మాత్రమే ప్రవేశ పెట్టామన్నారు అమిత్ షా.