పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్
మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
అమరావతి – పెన్షన్ల పంపిణీలో ఏపీ అరుదైన రికార్డ్ సృష్టించిందని అన్నారు ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా కొండపిలో ఫించన్లు పంపిణీ చేశారు మంత్రి. ఫించన్ల పంపిణితో రాష్ట్రంలో పండుగ వాతావారణం నెలకొందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 7 వేల ఫించన్ ఒకేసారి ఇచ్చామని చెప్పారు.
ఇక నుంచి ప్రతి నెలా రూ. 4 వేలు ఫింఛన్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. జగన్ కి ఫించన్ రూ. 1000 పెంచడానికి 5 ఏళ్ల సమయం పట్టిందంటూ ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే సారి రూ. 7 వేలు ఫించన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని కొనియాడారు.
65,18,496 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఫించన్ తీసుకున్న లబ్దిదారులు నిండు మనస్సుతో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.