NEWSNATIONAL

ఆర్ఎస్ఎస్ భావ‌జాలం ప్రమాదం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే

న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే నిప్పులు చెరిగారు. సోమ‌వారం రాజ్య‌స‌భ‌లో ఆయ‌న రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌ద‌రు సంస్థ భావ‌జాలం అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ఇది దేశానికి తీర‌ని మ‌చ్చ‌గా మారింద‌న్నారు ఖ‌ర్గే.

ఆనాటి ప్ర‌ధాన‌మంత్రి నెహ్రూ ప‌దే ప‌దే ఆర్ఎస్ఎస్ ను , దాని భావ‌జాలాన్ని వ్య‌తిరేకిస్తూ వ‌చ్చార‌ని గుర్తు చేశారు. ఇదే స‌మ‌యంలో స‌భ‌లో కొలువు తీరిన దివంగ‌త ప్ర‌ధాని అట‌ల్ బిహారి వాజ్ పేయి నెహ్రూను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తార‌ని తెలిపారు.

ఈ సంద‌ర్బంగా జోక్యం చేసుకున్నారు రాజ్య‌స‌భ స్పీక‌ర్, ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ క‌ర్. వాజ్ పేయ్ ఏ సంస్థ‌కు చెందిన వారో మీరు చెప్ప‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. ఆర్ఎస్ఎస్ లో భాగం కావ‌డం నేరం ఎలా అవుతుంద‌ని నిల‌దీశారు ఖ‌ర్గేను. ఇది దేశ అభివృద్ది కోసం కృషి చేస్తున్న సంస్థ‌గా అభివ‌ర్ణించారు ఉప రాష్ట్ర‌ప‌తి.

దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.