ప్రత్యేక హోదాపై నోరు విప్పని బాబు
నిప్పులు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హొదా ఇవ్వాలంటూ నితీష్ కుమార్ తీర్మానం చేయడమే కాదు మోడీ ముందు డిమాండ్ పెట్టారని మరి నిన్నటి దాకా బీరాలు పలికిన చంద్రబాబు నోరు ఎందుకు పెకలడం లేదంటూ ప్రశ్నించారు ఏపీ పీసీసీ చీఫ్.
ప్రస్తుతం మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు ఎందుకని స్పందించడం లేదంటూ నిలదీశారు. ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనంగా ఉన్నారనే దానిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా , 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా అని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా ..మరి ఇప్పుడు ఎందుకు మరిచి పోయారంటూ ఎద్దేవా చేశారు షర్మిలా రెడ్డి.
హోదా ఇవ్వకుంటే మద్దతు ప్రకటించమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరని భగ్గుమన్నారు.