NEWSTELANGANA

బెయిల్ నిరాక‌ణ క‌విత ఆందోళ‌న

Share it with your family & friends

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో జైలుపాలు

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ ప్ర‌స్తుతం తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు బిగ్ షాక్ త‌గిలింది. త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను తిర‌స్క‌రించింది ఢిల్లీ హైకోర్టు.

ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత. లిక్కర్‌ కేసులో కవితకు బెయిల్‌ నిరాకరించింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్‌ నిరాకరించ‌డం విశేషం.

ఇప్ప‌టికే లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించి క‌విత‌తో పాటు ఆప్ సీనియ‌ర్ నాయ‌కుడు ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా, ఆప్ చీఫ్ , సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ల‌ను అదుపులోకి తీసుకుంది. ప‌లువురిని అరెస్ట్ చేసింది. ఇంకా ఈ కేసు కొలిక్కి రాలేదు.

వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డింద‌ని , క‌విత మొత్తం లిక్క‌ర్ దందాలో కింగ్ క్వీన్ గా ఉంద‌ని ఈడీ, సీబీఐ ఆరోపించింది. ఆమె అనుకున్నంత అమాయ‌కురాలు కాద‌ని, ఒక‌వేళ కోర్టు గ‌నుక బెయిల్ ఇస్తే కేసును , సాక్ష్యాధారాల‌ను తారు మారు చేస్తుంద‌ని ఆరోపించింది.