ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల
16 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిరుద్యోగులకు సంబంధించి టెట్ ను నిర్వహించేందుకు నిర్ణయించింది. ఏపీలో ఏపీలో 16వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనుంది.
ఈ తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు.
మరోవైపు, మెగా డీఎస్సీకి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా టీచర్ కావాలంటే తప్పనిసరిగా టెట్ రాయాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రత్యేక నిబంధన.
దీంతో అటు డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారంతా ఇప్పుడు టెట్ పై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు టెట్ ను విడుదల చేయడం విశేషం.