మరాఠా అభివృద్దికి కేంద్రం సహకారం
స్పష్టం చేసిన ప్రధాన మంత్రి మోడీ
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠా అభివృద్దికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఇవాళ తనను శివసేన ఎంపీలు కలిశారు. ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో అస్తవ్యస్తంగా ఉండేదని తాము వచ్చాక సీన్ మారిందన్నారు. తమది రాజకీయ కూటమి కానే కాదన్నారు. తమది జన్మ జన్మలతో కూడిన బంధం అన్నారు నరేంద్ర మోడీ. దేశ అభివృద్దితో పాటు రాష్ట్ర అభివృద్దికి తాము ఇతోధికంగా సహకారం అందజేస్తున్నట్లు చెప్పారు ప్రధానమంత్రి.
శివసేన స్థాపకుడు, దివంగత ప్రజా నాయకుడు బాలా సాహెబ్ థాకరే కలలు కన్న ఆశయాలను తాను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు నరేంద్ర మోడీ.
సీఎం ఏక్ నాథ్ షిండే సైతం తమతో కలిసి అడుగులు వేస్తున్నారని తెలిపారు ప్రధాన మంత్రి. ఇక నుంచి మరాఠాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని కోరారు .