కావలి ఘటనపై లోకేష్ దిగ్భ్రాంతి
పాఠశాల బస్సును ఢీకొన్న లారీ
అమరావతి – కావలి సమీపంలో మంగళవారం పాఠశాల బస్సును ఢీకొంది లారీ. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్ఘ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో అక్కడికక్కడే క్లీనర్ చని పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులను తక్షణమే తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా నారా లోకేష్ ఆదేశించారు. స్కూల్ యాజమాన్యాలు బస్సులను అన్నింటిని కండీషణ్ లో పెట్టుకోవాలని సూచించారు.
బస్సుల ఫిట్ నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని పేర్కొన్నారు. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు నారా లోకేష్.
ప్రధానంగా రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు ఎక్కడికక్కడ బస్సులను తనిఖీ చేయాలని ఆదేశించారు. దీని వల్ల అవి ఫిట్ నెస్ కలిగి ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుందన్నారు ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి.