గాంధీ కుటుంబంపై మోడీ కన్నెర్ర
పీఎం కావడాన్ని తట్టుకోలేక పోతోంది
న్యూఢిల్లీ – దేశ ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి చెందని వ్యక్తి మూడోసారి దేశానికి ప్రధానమంత్రి కావడాన్ని జీర్ణఙంచు కోలేక పోతోందని మండిపడ్డారు.
వరుసగా 3వ సారి ప్రధానిగా నెహ్రూ రికార్డును ప్రధానమంత్రి మోడీ సమం చేశారు. 60 ఏళ్ల తర్వాత ఇది జరగడం విశేషం. 295 మంది ఎన్డీఏ ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాలతో అనుసంధానం చేసుకోవాలని కోరారు నరేంద్ర మోడీ.
లోక్ సభలో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం అధికార పక్షం మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. ఈ తరుణంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే తనను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ప్రధాన మంత్రి .