పనుల ప్రగతిపై డిప్యూటీ సీఎం సమీక్ష
శాఖల వారీగా వివరాలు తెలుసుకుంటున్న పవన్
అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖల వారీగా మంగళవారం సమీక్ష చేపట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్., పర్యావరణ, అటవీ శాఖలపై రివ్యూ చేశారు . పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో శాఖల వారి సమీక్ష ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు. శాఖల వారీగా కాకినాడ జిల్లాలో ఉన్న స్థితిగతులను పవన్ కళ్యాణ్ కు అధికారులు వివరించారు.
కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ ,నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల గురించి, నిధులు మంజూరు గురించి ఆరా తీశారు. ఏ మేరకు పెండింగ్ లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.