NEWSANDHRA PRADESH

ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా సి. రామ‌చంద్రయ్య‌

Share it with your family & friends

మంత్రి స‌మ‌క్షంలో నామినేష‌న్ దాఖ‌లు

అమరావ‌తి – రాష్ట్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే కోటా కింద‌ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు సి రామచంద్రయ్య. మంత్రి ఎన్ఎండీ ఫరూక్, కూటమి ఎమ్మెల్యేల సమక్షంలో నామినేషన్ దాఖలు చేయ‌డం విశేషం.

శాసన సభ్యుల కోటాలో శాసన మండలిలో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఖాళీలు ఏర్ప‌డ్డాయి. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసన సభ కమిటీ హాల్ లో మంగ‌ళ‌వారం జరిగింది. జనసేన పార్టీ తరఫున అభ్యర్థి గా పిడుగు హరి ప్రసాద్ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌గా తెలుగుదేశం పార్టీ తరఫున సి. రామచంద్రయ్య లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు.

రిటర్నింగ్ అధికారి ఎం. విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పి.వి. సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు.. జనసేన పార్టీ ప్రతినిధులు మంత్రి నాదెండ్ల‌ మనోహర్, కందుల దుర్గేష్, లోకం మాధవి, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్; తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్, ఎన్. ఎం. డి. ఫరూఖ్,
జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, యేలూరి సాంబశివరావు హాజరయ్యారు.