కేసీఆర్ వస్తే సీన్ సితారే
నిప్పులు చెరిగిన కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ ను ఎండగట్టారు. ఇదో బేకార్ ప్రభుత్వమంటూ ఎద్దేవా చేశారు. ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేసిందంటూ మండిపడ్డారు.
పదేళ్లలో తెలంగాణను అన్ని రంగాలలో తాము అభివృద్ది చేశామన్నారు. కానీ ప్రజలు తమను పట్టించుకోక పోవడం బాధగా ఉందన్నారు. అయినా రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు.
కళ్ల ముందు తాము చేసిన అభివృద్దిని చూసి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన పరివారం ఓర్చుకోలేక పోతున్నారని సెటైర్ వేశారు. ఇవాళ ఐటీ రంగానికి సంబంధించి ఇండియాలోనే నెంబర్ వన్ స్టేట్ గా తీర్చి దిద్దిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
ప్రస్తుతం తమ పార్టీ బాస్ రెస్ట్ తీసుకుంటున్నారని, ఆయన కదన రంగంలోకి దూకితే వార్ వన్ సైడ్ కావాల్సిందేనని జోష్యం చెప్పారు కేటీఆర్. ఇప్పుడే ట్రైలర్ మొదలైందని అసలు సినిమా ముందుందని అన్నారు. సినిమా స్టార్ట్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోమన్నారు.
ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతూనే ఉంటామని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు.