టీజీపీఎస్సీ ముట్టడికి మద్దతు
శాంతియుతంగా జరిగేలా చూడాలి
హైదరాబాద్ – బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ నిరుద్యోగులు తల పెట్టిన టీజీపీఎస్సీ ముట్టడికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఎన్నికల సందర్బంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాకమ్మ కబుర్లు చెప్పారని , పవర్ లోకి వచ్చాక వాటిని మరిచి పోయారంటూ మండిపడ్డారు ఆర్ఎస్పీ. తమ న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉద్యమం కొనసాగింపులో భాగంగా ఇవాల్టి నుంచి అశోక్ సార్ చేపట్టిన ఆమరణ దీక్షకు తాను పూర్తి స్థాయిలో మద్దతు తెలియ చేస్తున్నట్లు ఆర్ఎస్పీ ప్రకటించారు. ఇదేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు.
నిజానికి ఈ డిమాండ్లలో ఏవీ కొత్తవి లేవన్నారు. అన్నీ కాంగ్రేసు ప్రతిపక్షంలో ఉన్నపుడు కోరినవేనని తెలిపారు. అధికారం లోకి రాగానే సడన్ గా నిరుద్యోగులెట్ల చేదుగా మారారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు.
ఏడు నెలల్లో కేవలం 6063 కొత్త ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలోనివే అవి అని తెలిపారు. నిలదీసి అడిగితే పోలీసు లాఠీలను ఝళిపిస్తున్నారని ఫైర్ అయ్యారు,
జీవో 46 సవరణల మీద మీరేసిన కమిటీ ఇంత వరకు జాడ లేదన్నారు, 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 మెయిన్స్ కు అనుమతి మీద కాని, గ్రూప్-2 , గ్రూప్ 3, డీఎస్సీ పోస్టుల పెంపు మీద కాని, ఏఈఈల నియామకాల మీద కానీ ఇసుమంతైనా సోయి లేకుండా ప్రవర్తించడం దారుణమన్నారు.