ఎమ్మెల్సీ అభ్యర్థిగా హరి ప్రసాద్ నామినేషన్
టీడీపీ నుంచి సి. రామచంద్రయ్య నామినేషన్
అమరావతి – జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరి ప్రసాద్ కు ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కింది. మంగళవారం ఎమ్మెల్యేల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. టీడీపీ నుంచి సి. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేయగా హరిప్రసాద్ జనసేన పార్టీ నుంచి నామినేషన్ వేశారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జనసేన పార్టీ శాసనసభ్యులు లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, పత్సమట్ల ధర్మరాజు, గిడ్డి సత్యనారాయణ, వర ప్రసాద్ తదితరులు వెంట రాగా రిటర్నింగ్ అధికారి ఎమ్. విజయరాజుకి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు పిడుగు హరి ప్రసాద్.
పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడ వరకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉందన్నారు. ఇప్పటి వరకు పాత్రికేయుడిగా ఆ సమస్యల పరిష్కారానికి పరోక్షంగా కృషి చేశానని తెలిపారు.. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించిందని చెప్పారు.