NEWSTELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ వాయిదా

Share it with your family & friends

మ‌రో మూడు వారాల పాటు పొడిగింపు

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచ‌ల‌నం రేపింది ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించింది. గ‌తంలో కొలువు తీరిన కేసీఆర్ స‌ర్కార్ అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయ‌కులు, సినీ రంగానికి చెందిన వారిపై దొంగ‌త‌నంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి దీనిని సీరియ‌స్ గా తీసుకున్నారు. ఆ వెంట‌నే సిట్ ను ఏర్పాటు చేశారు. గ‌తంలో ప‌ని చేసిన పోలీస్ ఉన్న‌తాధికారుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధ‌వారం విచార‌ణ కొన‌సాగింది.

ఈ సంద‌ర్బంగా ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌ని హైకోర్టుకు తెలిపారు ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది. ఇప్ప‌టికే కౌంట‌ర్ ఫైట్ దాఖ‌లు చేశామ‌ని, పూర్తి వివ‌రాలు అందేందుకు , నివేదిక రూపొందించేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు కేసును మరో మూడు వారాల పాటు వాయిదా వేస్తున్న‌ట్లు తీర్పు చెప్పింది.