అమరావతి రాజధానిపై శ్వేత పత్రం
విడుదల చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని కావాలని కక్షకట్టి నామ రూపాలు లేకుండా చేయాలని చూశాడని కానీ తనే అడ్రస్ లేకుండా పోయాడని మండిపడ్డారు.
బుధవారం అమరావతి రాజధానిపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా అమరావతి ప్రాధాన్యత, ప్రాంతపు విశిష్టత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జగన్ ఎలా విధ్వంసం చేశాడనో కళ్లకు కట్టినట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు.
జగన్ వస్తూనే, ప్రజావేదిక కూల్చివేతతో అమరావతి నాశనానికి అడుగులు వేశాడని ఆరోపించారు. 3 రాజధానులు అంటూ, తుగ్లక్ నిర్ణయం ఒకటి తీసుకుని, రాష్ట్ర పరువు తీసాడని ఎద్దేవా చేశారు.
1631 రోజులు అమరావతి రైతులని, మహిళలని, ఎన్ని రకాలుగా హింస పెట్టొచ్చో, అన్ని రకాలుగా వాళ్ళని హింసించాడని ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. .ఒక వ్యక్తి మూర్ఖత్వం, ఒక వ్యక్తి కక్ష, ఒక వ్యక్తి తుగ్లక్ నిర్ణయాలు, 5 కోట్ల మంది ఆంధ్రులకు శాపాలు అయ్యాయని వాపోయారు. రాజధాని నిర్మాణం మధ్యలో ఆపివేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.