అమరావతిని నెంబర్ వన్ చేస్తా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ప్రతి తెలుగు వాడు గర్వించే రాజధాగా అమరావతిని తీర్చి దిద్ది దేశంలోనే నెంబర్ వన్ గా చేస్తానని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బుధవారం సచివాలయంలో అమరావతి పై శ్వేత పత్రం విడుదల చేశారు. గత ఐదేళ్ల వైసీపీ కాలంలో ఎలా నష్ట పోయిందో, ఎలా విధ్వంసానికి గురైందో తెలిపారు.
ఈ సందర్బంగా ప్రతి ఒక్కరు ఇది మా రాజధాని అని చెప్పుకునేలా నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తన నైజమని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఎన్ని వేల కోట్లు అయినా సరే అమరావతిని అద్భుతంగా తయారు చేస్తామన్నారు సీఎం.
ఈ సందర్బంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కావాలని అమరావతిని పక్కన పెట్టాడని, రైతులను, మహిళలను, ఇక్కడి వారిని నానా హింసకు గురి చేశాడని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అమరావతే మన రాజధాని అంటూ నమ్మించాడని, ఆ తర్వాత నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని ధ్వజమెత్తారు నారా చంద్రబాబు నాయుడు.