సీఎం చంపా సోరేన్ రాజీనామా
మనస్పూర్తిగానే చేస్తున్నా
రాంచీ – జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపా సోరెన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం తన రిజైన్ పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం లో గత కొంత కాలంగా అనిశ్చిత పరిస్థితి నెలకొనకుండా ఉండేందుకు గాను తాను సీఎం కావాల్సి వచ్చిందని చెప్పారు.
కొన్ని రోజుల కిందట తనను సీఎంగా చేసిన ఘనత శాసన సభ్యులకు దక్కిందన్నారు. ఇదంతా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే జరిగింది తప్ప వ్యక్తిగత లాభం కోసం మాత్రం కాదన్నారు చంపా సోరేన్. ఆయన ప్రజల నాయకుడిగా పేరు పొందారు.
కింది స్థాయి కుటుంబం నుంచి వచ్చిన నాకు అత్యున్నతమైన పదవిని దక్కేలా చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సోరేన్ అరెస్ట్ కావడంతో చంపా బాధ్యతలు చేపట్టారు. ఆయన జైలు నుంచి విడుదల కావడంతో తిరిగి బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు తాను తప్పుకుంటున్నట్లు ఇవాళ ప్రకటించారు చంపా సోరేన్.