NEWSANDHRA PRADESH

త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు

Share it with your family & friends

నిరుద్యోగుల‌కు నారా లోకేష్ సూచ‌న‌

అమ‌రావ‌తి – ఏపీ ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న టెట్ , మెగా డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌పై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్షించారు. టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వ‌స్తున్న విజ్ఞ‌ప్తులు ప‌రిశీలించాల‌ని సూచించారు.

టెట్ సిలబస్ మార్పు అంటూ జ‌రుగుతున్న‌ది త‌ప్పుడు ప్ర‌చారమ‌ని పేర్కొన్నారు సిలబస్ లో ఎటువంటి మార్పులు చేయ‌లేదని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్. సిల‌బ‌స్‌ వివరాలను https://aptet.apcfss.in అందుబాటులో ఉంచామ‌న్నారు.

మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాల‌కు ఎదురైన న్యాయ పరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డిఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు నారా లోకేష్. విద్యాప్రమాణాలు మెరుగు పర్చడమే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.